
టాలీవుడ్ సుందరాంగి కాజల్ అగర్వాల్ మొత్తానికి ముడుముళ్లతో ఓఇంటామే కాబోతుందన్న విషయం తెలిసిందే. హీరోల్లో ప్రభాస్, రానా, శర్వానంద్ ల పెళ్లి గురించి రోజు ఎలాగైతే చర్చ జరిగేదో హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ పెళ్లి కూడా ఎప్పుడూ అంతే హాట్ టాపిక్ గా నిలిచేది. ఆమె ఎవరిని చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది? అనే ప్రశ్నలకు మొన్న సమాధానం దొరికింది. ఆమె స్వయంగా నేను గౌతమ్ కుల్చ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల నడుమ వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించింది. అతను ఒక వ్యాపారవేత్త. ఈ ఇద్దరు చిన్ననాటి స్నేహితులట ఎప్పటి నుంచి ప్రేమలో ఉండగా మొన్నీమధ్య ఇంట్లో వారికి చెప్పి వివాహంకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఆమధ్య కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో వరుస సినిమాలు చేసింది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు వినిపించాయి. ఇక ఇప్పుడు కాజల్ అధికారిక ప్రకటనతో అవి కేవలం పుకార్లు మాత్రమేనని అర్ధం అయింది. అంతేకాదు కాజల్ పెళ్లికి వెళ్లబోయే ఏకైక టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో శ్రీనివాస్ ఆమె పెళ్లి మిస్ అవ్వలేడని తెలుస్తోంది.