
ఇప్పటికే థియేటర్లు మూతపడి నాలుగు నెలలు అయింది. ఇప్పుడు ప్రభుత్వం తెరుసుకోమని అనుమతి ఇచ్చినప్పటికీ తెరిస్తే కరోనా వ్యాప్తి అదిగమవుతుందని భావించి నిర్మాతలు, థియేటర్ ఓనర్లు నిరాకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శక నిర్మాతలకు ఓటిటిలు మార్గంగా కనిపిస్తున్నాయి. తాజాగా కొన్ని తెలుగు, తమిళ్ సినిమాలు ఓటిటీలో రిలీజ్ అయినా నేపధ్యంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు కూడా ప్రముఖ ఓటిటి సంస్థ భారీ మొత్తంలో అఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తమ ఓటిటిలో రిలీజ్ చేయడానికి 25 కోట్లు అఫర్ చేసినట్లు తెలుస్తుంది. మరి చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.