
'సీనయ్య' చిత్రంతో కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం దసరా సందర్భంగా లాంచ్ అయ్యింది. సమ్మర్ 2020కి విడుదల కానుంది. వివి వినాయక్, పాత్రకు తగినట్లుగా చాలా బరువు తగ్గడాని లాంచ్ సమయంలో చూస్తే అర్ధం అయింది. అంతేకాదు అతను కొత్త విగ్‌ను పెట్టుకొని కొంచెం కుర్రగా కనిపిస్తున్నారు. కానీ తాజా ఊహాగానాలు ఏమిటంటే, ఈ చిత్రం అటకెక్కింది. దర్శకుడు నరసింహారావు వివరించిన ఫైనల్ స్క్రిప్ట్ ఇటు వివి వినాయక్ కు అటు నిర్మాత దిల్ రాజుకు నచ్చలేదట. ఈ చిత్రం గురించి తాజా సమాచారం ఏమిటంటే, దీన్ని అటకెక్కించలేదు కాని మంచి డ్రాఫ్ట్ వెర్షన్ స్క్రిప్ట్ అయ్యే వరకు మాత్రమే నిలిపివేయబడుతుంది. అందుకే దీని కోసం ప్రముఖ రచయితలు పరుచురి బ్రదర్స్ ను స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేయమని టీం అడిగారు. స్క్రిప్ట్ కు ఏదైనా మార్పులు ఉంటే వారు సూచిస్తారు. అప్పుడు దిల్ రాజు అండ్ కో విని నిర్మాణాన్ని ముందుకు సాగిస్తారు. మరింత స్పష్టత కోసం కొంత సమయం వేచి ఉండాలి.