విజయ్ దేవరకొండ ముందే ‘అర్జున్ రెడ్డి’ని బండ బూతులు తిట్టిన నటి పార్వతి

తెలుగులో ఔట్ అండ్ ఔట్ బోల్డ్ చిత్రంగా తెరకెక్కింది అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో విజయ్ కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇదిలావుంటే, తాజాగా అనుపమ చోప్రా నిర్వహించిన రౌండ్ టేబుల్ డిస్కషన్ లో బాలీవుడ్ నటులతో పాటు పలు సౌత్ స్టార్లు కూడా పాల్గొన్నారు. మలయాళం నటి పార్వతి, తమిళ్ నటుడు విజయ్ సేతుపతి, తెలుగు నుంచి విజయ్ దేవరకొండ కాగా బాలీవుడ్ నుంచి దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, అలియా భట్, ఆయుష్మాన్ పాల్గొన్నారు. అందరూ వాళ్ల కెరియర్ గురించి, ఫ్యాన్ మూమెంట్స్, ఇండస్ట్రీలో మహిళల పాత్ర గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో పార్వతి విజయ్ దేవరకొండ ఎదురుగానే అర్జున్ రెడ్డి సినిమాను విమర్శించింది. 'నేను ఇలాంటి సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు చెయ్యను. ఏదైనా లవ్ స్టొరీ, ట్రాజెడి సినిమా చూస్తే కాసేపటికి మర్చిపోతాము. కానీ యూట్యూబ్లో అర్జున్ రెడ్డి సినిమాకు యువత కామెంట్లు చూసి షాక్ అయ్యాను. హీరో హీరోయిన్ను కొట్టడం యూత్ ఎంకరేజ్ చేయటం చూసి షాకయ్యాను. సామాజాన్ని చెడగొట్టే సినిమాలను నేను ఎప్పటికి చేయ్యనని' విమర్శించారు.