
'నాకో తిక్కుంది, దానికో లెక్కుంది' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ కు ఏ రేంక్ లో విజిల్స్ పడ్డాయో తెలిసిందే. అల..విజిల్స్ పడేలా గబ్బర్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ తో పవన్ మరో సినిమా చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకెన్నో మర్చిపోలేని మాస్ డైలాగ్లను ఇస్తుందోనని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజా పుకారు కాస్త ఆవేదనకు గురి చేస్తుంది. హరీష్ శంకర్ పవన్ ను మరోసారి పోలీస్ పాత్రలో చూపించనున్నట్లు తెలుస్తుంది. అయితే వారి కాంబోలో వచ్చిన పోలీస్ డ్రామా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ తరువాత అదే తరహాలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అవ్వడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. మరోసారి పోలీస్ అంటే ఏవమువుతుందో, ఎలా ఉంటుందోనని ఆవేదన చేందుతున్నారు.