
అభిమాన హీరో కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారు కాబట్టే ఈరోజు వాళ్ళు స్టార్లుగా ఆ రేంజ్ లో ఉన్నారు. కాని అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుందని మనకి ఎన్నో సందర్భాలు నేర్పించాయి. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా పవన్ అభిమానులు కొందరు తమ హీరో పుట్టినరోజు సందర్భంగా భారీ కట్ ఔట్ ను ఏర్పాటు చేసే తరుణంలో జారీ కరెంట్ తీగలపై పడ్డారు. పడిన వాళ్లలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. అందుకే అభిమాన హీరో కోసం సంబరాలు చేసుకోవాలి, చిందులు వెయ్యాలి కానీ కుటుంబాన్ని నడిరోడ్డుపై నిస్సహాయంగా నిల్చోపెట్టకూడదని మరోసారి ఈ ఘటనతో అర్ధం అయింది.