
టాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన రొమాంటిక్ కామెడీలలో "తొలిప్రేమ" ఐకానిక్ గా నిలుస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కేరియర్ లో మొట్టమొదటి బిగ్గెస్ట్ హిట్. ఆ చిత్రం వాస్తవానికి పవన్ ను తెలుగు పరిశ్రమలో హ్యాపెనింగ్ స్టార్ గా మార్చింది. అతను మెగాస్టార్ సోదరుడు అనే ఇమేజ్ నుండి బయటకు వచ్చి, తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. తరువాత మళ్ళీ తొలిప్రేమ దర్శకుడు కరుణారన్ స్టైల్ మార్చి పవన్‌తో 'బాలు' సినిమాను తెరకెక్కించాడు. కానీ ఇది బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయింది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ కరుణాకరన్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు పవన్ కు ప్రేమ కథను వివరించడానికి కరుణాకరన్ తరచూ పవన్ ను కలుస్తున్నారని సమాచారం. ఈసారి వారి బాలులా కాకుండా కథలో ఎటువంటి క్రైం సన్నివేశాలు లేకుండా కేవలం ప్రేమ కథతో, తొలిప్రేమాను పోలి ఉంటుంది. ఇది విన్న ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ప్రేమ కథ సెట్ అవుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి తొలిప్రేమ దర్శకుడు పవన్ ను మెప్పించి ఒప్పిస్తాడా లేదా అనేది చూడాలి.