
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి రాజకీయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇకపై ప్రజలతోనే తన ప్రయాణం అంటూ ప్రకటించిన పవన్ కొన్ని కారణాల వల్ల మళ్ళీ మేకప్ వేసుకునేందుకు సిద్ధం అయ్యారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేయనున్నారు. మొన్నీమధ్యే దిల్ రాజు ఆఫీస్ లో సినిమా ప్రారంభం అయింది. జనవరిలో రెగులర్ షూటింగ్ మొదలు కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంకు థమన్ సంగీతం అందిస్తున్నారు. తాప్సి పాత్రలో మొదట పూజా హెగ్డేను అనుకున్నప్పటికి ఆమె సెట్ అవ్వదని భావించిన దిల్ రాజు నివేధ థామస్ ను సెలెక్ట్ చేశారు. ఇకపోతే ముగ్గురు యంగ్ ఫీమెల్స్ రోల్స్ కోసం ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మల్లేశం సినిమాలో నటించిన తెలుగు అమ్మాయి అనన్య ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.