
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు తియ్యనని చెప్పి రాజకీయాల్లోకి వెళ్లి జనసేన పార్టీ పెట్టి ప్రజలకే నా జీవితం అంకితమని సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ ఫండ్ కోసం తనను నమ్ముకున్న వాళ్ళను బతికించడం కోసం మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాని చెప్పేసరికి పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆయనను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ తెలుగు రీమేక్ తో పవన్ రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముగ్గురి అమ్మాయిలకు సంబంధించింది. ఇంతో పవన్ లాయర్ గా కనిపించనున్నారని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ద్వారా స్పష్టవుతుంది. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుపై పవన్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిన కూడా టీజర్ కూడా రిలీజ్ చేయకుండా అభిమానులను ఇంత ఎదురుచూసేలా చేయటం కరక్ట్ కాదని మండిపడ్డారట. దీంతో దిల్ రాజు టీంకు కుదిరినంత త్వరగా టీజర్ ను విడుదల చేయమని చెప్పారట.