
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఖాయం అవ్వడం సుమారు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగిపోయాయి. ఇక చిత్రం మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కాబోతుంది అనగా..కరోనా వచ్చి అడ్డుకట్ట వేసింది. అయితే మూడు నెలల లాక్డౌన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇచ్చినప్పటికీ వకీల్ సాబ్ టీం షూట్ స్టార్ట్ చేయలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కేసులు బాగా పెరగడంతో షూటింగ్ నిలిపాము. ఎప్పుడైతే కేసులు తగ్గుతాయో అప్పుడే షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. అంటే ఇంకా ఈ ఏడాది చివరి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. అంటే 2021లో చిత్రం రిలీజ్ అవుతుందని అర్థం.