
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలి ప్రజల కోసమే అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలానికి పవన్ మళ్ళీ మేక్అప్ వేసుకోబోతున్నారని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" తెలుగు రీమేక్ లో పవన్ నటించనున్నారు. తాజాగా దిల్ రాజు ఆఫీస్ లో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమా మొదలైనా పవన్ మాత్రం ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో మెగా అభిమానులకు సందేహాలు మొదలయ్యాయి. అయితే వాళ్ళకు తాజాగా పవన్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. "నేను నా సినిమాల గురించి త్వరలో మాట్లాడతాను. అలానే రామ్ చరణ్ హీరోగా నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న. ఒక్కసారి డైరెక్టర్ కంఫర్మ్ అయితే అఫీషియల్ అనౌన్సమెంట్ చేస్తానంటూ" ప్రకటించారు.