
దర్శకుడు క్రిష్‌తో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం చేస్తున్నాడని గత కొన్ని వారాల నుండి వార్తల్లో ఉంది. తాజా విషయం ఏమిటంటే, నిర్మాత ఎం రత్నం కార్యాలయంలో పెద్దగా ఆర్భాటం లేకుండా పవన్-క్రిష్ ల సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించబడింది. తాత్కాలికంగా పిఎస్పికె 27 పేరుతో ఉన్న ఈ చిత్రం, పీరియడ్ డ్రామా కానుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. హీరోయిన్లుగా పూజా హెగ్డే మరియు ప్రగ్యా జైస్వాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎంఎం కీరవణి ఈ చిత్రానికి సంగీతం స్వరపరిచనున్నారు. సినిమాపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం దిల్ రాజుచే నిర్మించబడుతుంది. కొన్ని రోజుల క్రితం షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్ అతి త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.