
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో భారీ కాంబినేషన్లతో సినిమాల నిర్మాణం జరుగుతోంది. వందలాది కోట్ల బడ్జెట్టుతో ఆయా కాంబినేషన్లతో చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో భారీ కాంబినేషన్ తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. అదే పవన్ కల్యాణ్-రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ చిత్ర నిర్మాణం. ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తాడట. ఇటీవల రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లను దర్శకుడు శంకర్ ఈ విషయంలో సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ లైన్ కూడా ఓకే అయినట్టు చెబుతున్నారు. ఇందులో పవన్, చరణ్ ల పాత్రలు ఇంచుమించు సమానంగా వుంటాయని అంటున్నారు.