
మెగా ఫ్యామిలీలో గత రెండు మూడు రోజులుగా సందడి నెలకున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో నేడు రాత్రి జరుగనుంది. ఈనేపధ్యంలో మొన్న సంగీత్ పార్టీ నిన్న మెహందీ ఫంక్షన్ జరిగింది. ఇంటి సభ్యులంతా నిహారిక వెడ్డింగ్ ఫంక్షన్స్ లో కనిపిస్తున్నా పవన్ కళ్యాణ్ లేని లోటు బాగా తెలిసింది. ఇక ఆ లోటు లేకుండా నిన్న సాయంత్రం నిహారిక పెళ్లికి ల్యాండ్ అయ్యారు. అంతే ఇక మెగా ఫ్యామిలీ కంప్లిట్ అయ్యింది. అయితే మెగా ఫ్యామిలీ పిక్చర్ ఒకటి బయటికి వచ్చింది. అందులో అందరి కళ్ళు ఒకరి మీదే ఉన్నాయి. అది పవర్ స్టార్ కూడా కాదు. అది...పవర్ స్టార్ కుమారుడు అకిరా. ఎర్ర రంగు దుస్తుల్లో అందరిని ఆకర్షించాడు. పవన్ వారసుడు అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.