
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. పవన్ కనిపిస్తే చాలు ఒక నెల రోజుల పాటు ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. పవన్ సినిమాల్లో నటించి ఆ క్రేజ్ సొంతం చేసుకుంటే...పవన్ పిల్లలుగా పుట్టే క్రేజ్ దక్కించుకున్నారు. పవన్ రేణు దేశాయ్ ల బిడ్డ అకిరా నందన్ ఫోటో లీక్ అయినా లేదా బయట కనిపించిన ఇక అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతాయి. ఎంతలా అంటే మొన్న నిహారిక పెళ్లిలో అంతమంది మెగా హీరోలు ఉంటే నెటిజన్ల కళ్ళన్నీ అకిరా పైనే. ఇక తాజాగా పవన్ అన్నా లెజ్నేవా బిడ్డ మార్క్ శంకర్ రష్యా నుండి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా కెమెరాలకు చిక్కాడు. మాస్క్ ధరించిన ఈ బుల్లి పవర్ స్టార్ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.