
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఆజ్ఞతవాసి' తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అయ్యారు. అంతేకాదు తాను ఇకపై ప్రజా సేవకే అంకితం సినిమాలు చేయనంటూ ప్రకటించిన కొన్ని రోజులకు 'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఇస్తూ ప్రజలకు అదిరిపోయే సర్ప్రయిజ్ ఇచ్చారు. కరోనా మహమ్మారి రాకపోయుంటే ఈ ఏడాది మే నెలలో రిలీజ్ కావాల్సింది. అసలు ఈ ఏడాదిలో సినిమా వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కారణం, షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. పవన్ ఏమో కరోనా పూర్తిగా తగ్గితే కానీ షూటింగ్ మొదలుపెట్టడానికి లేదని చెప్పేసారు. దీంతో నిరాశపడ్డ అభిమానులకు తాజాగా ఒక వార్త ఊరటను ఇచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ టీం ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ ను సిద్ధం చేస్తుందని దర్శకుడు వేణు శ్రీరామ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది చూసిన అభిమానులు ఎట్టకేలకు ఒక అప్డేట్ వచ్చిందని పండగ చేసుకుంటున్నారు.