
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. పవన్ కనిపిస్తే చాలు అరుపులు, కేకలతో ప్రాగణం మొత్తం దద్దరిల్లుతుంది. సినిమా తీసి సుమారు రెండు సంవత్సరాలు అవుతున్నా ట్విట్టర్ లో అత్యధికమైన ట్వీట్లు పవన్ పేరు మీదనే నమోదయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే పవన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తనకున్న ఒక మంచి అలవాటు మరియు చెడ్డ అలవాటు ఏంటని అడిగితే ఒకటే చెబుతారు 'పుస్తకాల పురుగు' అని. అవును పవన్ కి ఉన్న మంచి మరియు చెడ్డ అలవాటు అదే. సమయం దొరికినప్పుడల్ల పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ లో కాస్త బ్రేక్ దొరకగానే కూడా ఒక చైర్ లో కూర్చొని అదే పని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.