
మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. మరో పక్క అల్లు అర్జున్ హీరోగా నటించిన "అల..వైకుంఠపురంలో" జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలకు రిలీజ్ కాకముందు నుంచే పోటీ మొదలైంది. మొదట రిలీజ్ డేట్ గురించి, ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి, ఇప్పుడు ఈవెంట్ కు హాజరయ్యే గెస్ట్ గురించి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రంప్రి రిలీక్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సమెంట్ ను కూడా చిత్ర బృందం మొన్నీమధ్యే చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ టీంను ప్రి రిలీజ్ ఈవెంట్ కు రప్పిస్తున్నారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రప్పించే పనిలో పడ్డారట. త్రివిక్రమ్ కు పవన్ కు మంచి సన్నిహిత్యం ఉండటంతో పవన్ కూడా వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.