
క్లాస్ ఏమో మన ప్రిన్స్ మహేష్ బాబు మాస్ ఏమో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే మహేష్ కు కొంతవరకు అమ్మాయిల ఫాలోయింగ్ తో క్లాస్ గా ఉంటే అందరిని కవర్ చేస్తూ పవన్ మాస్ ఫాలోయింగ్ తో ఉంటారు. మరి ఈ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే? 'బొమ్మ అదుర్స్ కదూ' అనే డైలాగ్ ఎవ్వరైనా అనాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే..మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం ఫెమ్ పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ ఓ ముఖ్య అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ఒక రూమర్ వైరల్ గా మారింది. ది ఎంత వరకు నిజమో తెలియదు గాని గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. మరి పవన్ గెస్ట్ రోల్ చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.