
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఇటీవల తన సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఆజ్ఞతవాసి తరువాత రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. సినిమాలు మరియు రాజకీయాలు రెండింటినీ సమతుల్యం చేయనున్నాడు. నిన్న వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో కనిపించగా...తెలుగులో పవన్ కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా ఓకే చేశాడని విశ్వసనీయత సమాచారం. గ్యాప్ లేకుండా క్రిష్ సినిమాను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.