
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ యొక్క రీమేక్, కోర్ట్ రూమ్ డ్రామా 'వకీల్ సాబ్' లో నటుస్తున్నారు. పవన్ సినిమా వస్తుందని, అదీ మార్చి నెలలో విడుదలైన మొదటి పాట నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ‘వకీల్ సాబ్’ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, వకీల్ సాబ్ యొక్క మోషన్ పోస్టర్ బుధవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా రానుంది. సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్లో “బుధవారం” అని ట్వీట్ చేశారు. దీంతో మోషన్ పోస్టర్ పక్కా వస్తుందని అర్థం అయింది.