
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. పవన్ అభిమానులను అలరించేందుకు సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ ఇంట్రడక్షన్ సీన్లతో పాటు పలు సన్నివేశాలను పొందుపరిచారు. "అబ్జెక్షన్ యువరానర్" అంటూ కోర్టు హాల్లో తన వాగ్ధాటిని ప్రదర్శించడమే కాకుండా, "కోర్టులో వాదించడమే కాదు, కోటు తీసి కొట్టడం కూడా వచ్చు" అంటూ రౌడీలను ఉతికారేయడం ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.