
జన సేన చీఫ్ మరియు నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకుని, ఐదు సినిమాలకు సంతకం చేశాడని తెలిసిందే. నాన్-థియేట్రికల్ లాభాలలో వాటాతో పాటు పవన్ కళ్యాణ్ రూ.40 నుంచి 50 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. ఇటీవల పవన్‌కళ్యాణ్ పిల్లలు అకిరా నందన్, ఆద్యా కోసం 5 కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ ఇల్లు కొన్నారని, దీంతో వారు హైదరాబాద్‌లోని మెగా కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటుందని పవన్ ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పూణేలో ఉంటున్నారని అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఆమె హైదరాబాద్‌కు తిరిగి రావాలని ఆలోచిస్తోంది. రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా నందన్, ఆద్యా కెరియర్ల కోసం హైదరాబాద్‌లో ఉంటే మంచిదని భావిస్తుందట. రేణు దేశాయ్ తన పిల్లలు, సినిమాల్లో లేదా సినిమాలకు సంబంధించిన రంగాలలో మంచిగా రాణించాలని కోరుకుంటున్నారు అందుకే హైదరాబాద్‌లో ఉండి టాలీవుడ్‌కు దగ్గరగా ఉండటం మంచిదని ఆమె అభిప్రాయపడుతున్నారు.