
పవన్ కళ్యాణ్ నటించనున్న క్రిష్ దర్శకత్వ ప్రాజెక్ట్ తారాగణం గురించి సినీ సర్కిల్స్ లో రోజుకో చర్చ సాగుతుంది. చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ ను మేకర్స్ సంప్రదించారట. కాని ఆమె హీరోయిన్ పాత్ర కోసం కాదని వర్గాలు చెబుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య రెండు సన్నివేశాలతో కూడిన ఒక ఐటమ్ సాంగ్ లేదా ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలోనైనా కనిపించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్, ప్రగ్యా జైస్వాల్ నటించు సినిమా స్వాతంత్య్రంకు ముందు పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కనుందని వినికిడి. 'కంచె'తో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్ కు టాలీవుడ్లో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. 2018 లో వచ్చిన 'అచారీ అమెరికా యాత్ర'లో ప్రగ్యా చివరిగా కనిపించింది. అయినప్పటికి క్రిష్ ప్రగ్యాను సెలెక్ట్ చేసుకోవడం గమనార్హం.