
సీఎం కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి ఇదే.!
ఆర్టీసీ కార్మికులు 47 రోజులుగా విధులు మానేసి తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కార్మిక సంఘాలు ప్రభుత్వం ఎటువంటి శరత్తులు పెట్టకుండా ఉంటె విధుల్లోకి వస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ కార్మికులు తమ విధుల్లోకి వస్తే రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. "పెద్దలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, అంటూ మొదలుపెట్టి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని" కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు.