
అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన అత్తారింటికి దారేది, సినిమాకు యాంకర్ టర్న్ నటి అనసూయ భరద్వాజ్ కు ఒక చిన్న అతిధి పాత్ర వచ్చినా ఆ పాత్రను నిరాకరించింది అమ్మడు. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలోతెరకెక్కుతున్న సినిమాలో అనసూయ నటించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఇటీవలే తన 27వ చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో అనసూయ పాత్ర 30 నిమిషాల వ్యవధికి దగ్గరగా ఉంటుంది. కానీ ఆమె పాత్ర కథకు చాలా కీలకమట. మరి అనసూయ చేయబోయే పాత్ర ఎటువంటిదనే దానిపై క్లారిటీ లేదు. ఈ సినిమా కథ భారతదేశంకు స్వాతంత్య్రం రాకముందు ఉన్న పరిస్థితులపై ఉంటుందని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ఎఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.