
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లాయర్ సాబ్ అనే తాత్కాలిక పేరుతో జరుగుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం, బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చి నెలాఖరులోగా ముగించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ మేకర్స్ ఈ చిత్రాన్ని సమ్మర్ సీజన్లో మే 15న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే, పింక్ రీమేక్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన నిర్మాత అయిన దిల్ రాజు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ కూడా మేలో విడుదలైంది మరియు దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేశారు. అందుకే ఈ సినిమాను కూడా మేలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ ప్రేమికులను ఆకట్టుకునేలా పింక్ రీమేక్ కోసం అనేక మార్పులు చేసినట్లు దిల్ రాజు తెలిపారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నివేత థామస్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.