
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ విలాస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులందరు రెండు రోజుల ముందే వెళ్లి అన్ని ఈవెంట్స్ లో పాల్గొని సందడి చేశారు. పవన్ కూడా వస్తే బాగుండు అనుకున్న సమయంలో కొడుకు, కూతురితో ఎంట్రీ ఇచ్చి ఆ లోటు కూడా భర్తీ చేశారు. కొడుకు, కుమార్తెతో వచ్చిన పవన్ భార్యను ఎందుకు తీసుకురాలేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే దానికి కారణం ఉంది. పవన్ భార్య క్రిస్మస్ వేడుకలకు రష్యా వెళ్లారట. ప్రతి సంవత్సరం తాను తన పిల్లలను తీసుకొని ఇదే సమయంలో రష్యా వెళ్తుందని తెలుస్తుంది. అయితే పవన్ కూడా వెళ్ళేవాడే కానీ నిహారిక పెళ్లి హాజరయ్యేందుకు ఆ ప్లాన్ క్యాన్సల్ చేసుకున్నాడని తెలుస్తుంది.