
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యక ఎన్నో రోజులైంది. ఆయన్ను వెండితెరపై చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకే పవన్ మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బాలీవుడ్ హిట్ చిత్రం "పింక్" తెలుగు రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొన్నీమధ్యే దిల్ రాజు ఆఫీస్ లో సినిమా ప్రారంభమైంది. అయితే వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు నుంచే షూటింగ్ లో పాల్గొననున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పవన్ సుదీర్ఘ కాలం తర్వాత సినిమా చేస్తుండటంతో సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టుగా సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.