
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అంతకన్నా ఆసక్తి సినీ ఇండస్ట్రీలో నెలకుంది. అయితే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని అదే రీఎంట్రీ సినిమా అని అందరికి తెలిసిన విషయమే. ఈమేరకు పూజా కార్యక్రమాలతో సినిమా కూడా ప్రారంభం అయింది. అయితే సినీ సిర్కిల్స్ లో మాత్రం వేరేలాగా వినిపిస్తుంది. దర్శకుడు క్రిష్ పవన్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. జనవరి మొదటి వారంలో రెగులర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎం. రత్నం నిర్మాణ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ 40రోజులు కేటాయించారట. 2020 సమ్మర్ రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దినిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి పవన్ రీఎంట్రీ సినిమా క్రిష్ తో అవుతుందా? లేదా పింక్ రీమేకే రీఎంట్రీ అవుతుందా? చూడాలి.