
పవన్ కళ్యాణ్ యొక్క మోస్ట్ ఇంట్రెస్టెడ్ రీఎంట్రీ సినిమా "వకీల్ సాబ్" యొక్క మొదటి పాట, టీజర్ మరియు ట్రైలర్ ఇంకా విడుదల కానప్పటికీ, ఈ చిత్రంపై డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ట్రేడ్ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. వకీల్ సాబ్ నుండి పవన్ కళ్యాణ్ యొక్క ఫస్ట్ లుక్ ఒక్కటి చాలు అనుకుంట అద్భుతాలు చేయడానికి. ట్రేడ్ వర్గాల్లో చాలా మంది ఈ చిత్రంపై అధిక మొత్తంలో డబ్బు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, సినిమా పంపిణి హక్కులను కొనుగోలు చేయడానికి నిర్మాత దిల్ రాజుకు ఫోన్లు చేశారని చెప్పారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతమైన స్పందన లభించడమే కాకుండా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ ఫస్ట్ లుకే సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. డిమాండ్ తెలిసిన నిర్మాత దిల్ రాజు సినిమా హక్కులను చెల్లించేందుకు భారీ మొత్తాన్ని చెప్తున్నట్లు తెలుస్తోంది. త్వరగా సినిమా షూటింగ్ ముగించి మేలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.