
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. కుళ్లు, కుతంత్రాలు లేని పరిపాలన ప్రజలకు అప్పగించటమే తమ లక్షయమని చెప్తూ వచ్చిన పవన్...ఇకపై సినిమాలు చేయనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసారు. కానీ ఎప్పటికప్పుడు పవన్ రీఎంట్రీపై పుకార్లు పుట్టికొస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హిందీలో బిగ్ బీ ప్రధాన పాత్రలో నటించిన "పింక్" భారీ విజయాన్ని సాధించింది. ఆ చిత్రాన్ని బోణికపూర్ తమిళ్ లో అజిత్ ప్రధాన పాత్రలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ లో కూడా భారీ విజయాన్ని సాధించింది. అందుకే దిల్ రాజు, బోణికపూర్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో పింక్ సినిమాను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు కొన్ని లీకులు కూడా చేసారు. అయితే అలా లీక్‌లు చేసినందుకు దిల్ రాజుకు పవన్ మొట్టికాయలు కూడా వేశారని ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే పింక్ కథ అందరికి తెలిసినదే కాబట్టి తెలిసిన కథతో కాకుండా కొత్త కథతో తన దగ్గరకి రమ్మని దిల్ రాజుకు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.