
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చెయ్యక ఎన్నో రోజులైంది. ఆయన్ను వెండితెరపై చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకే పవన్ మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బాలీవుడ్ హిట్ చిత్రం "పింక్" తెలుగు రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొన్నీమధ్యే దిల్ రాజు ఆఫీస్ లో సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు పవన్ తీసుకుంటున్న పారితోషకం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సోషల్ నేపథ్యంలో సాగే కధ అవ్వడంతో తన ఇమేజ్ కు సెట్ అవుతుందని, షూటింగ్ కు కూడా పెద్ద సమయం పట్టదని పవన్ ఈ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా కోసం 20-25 రోజులు డేట్స్ కేటాయించిన పవన్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. దిల్ రాజు కూడా పవన్ ఇమేజ్ దృశ్య రూ.50 కోట్లు కూడా ఇచ్చేందుకు రెడీ ఉన్నాడని సమాచారం.