
సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్లు ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన పోస్ట్ పెట్టాలంటే లక్షల్లో వేతనం తీసుకుంటారు. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియా అందరిలోకి అందుబాటులో ఉండటంతో ఎక్కువ మందికి రిచ్ అవుతుందనే ఆలోచనతో ఈమధ్యకాలంలో బ్రాండ్ లు ఫెమస్ అయిన వారితో తమ ప్రాడక్ట్లను ప్రమోట్ చేయించుకుంటున్నారు. అల..తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఒక ఆకు ఎక్కువే చదివినట్లుగా ఏకంగా రాయల్ ఛాలెంజ్ విస్కీను ప్రమోట్ చేసింది. చేతిలో గ్లాసు, గ్లాసులో మందుతో రాయల్ ఛాలెంజ్ విస్కీ ఇప్పుడు తెలంగాణలో కూడా లభిస్తుందని చెప్తూ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు వారిని అమ్మడు ఏకంగా గలాసు పట్టుకుందే అంటూ ఆశ్చర్యపోతున్నారు.