
పూజ హెగ్డే ఇప్పుడు ఫుల్ బిజీగా వుంది. ఇటు తెలుగు సినిమాలు.. అటు హిందీ సినిమాలతో రెండు చోట్లా కథానాయికగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ఓ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా అక్కినేని హీరో అఖిల్ తో నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా జూన్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో అక్కినేని వారి హీరోతో ఈ ముద్దుగుమ్మ మరో చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇక ఇందులో చైతు పక్కన మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుంటారట. వారిలో మెయిన్ హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తాజాగా ఎంపిక చేసినట్టు, ఈ సినిమా చేయడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ జంట ఇదివరకు 'ఒక లైలా కోసం' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.