
ప్రస్తుతానికి టాలీవుడ్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఆమెకు బాలీవుడ్లో కూడా మంచి ఆదరణ ఉంది. ముంబై పరిశ్రమలో పూజ యొక్క మొట్టమొదటి యాడే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్కూటీకు సంబంధించినది అయింది. రణ్‌బీర్ తో యాడ్ షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పూజ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నేను ఫ్యాషన్ సన్నివేశంలో చేయడం ఇదే మొదటిసారి. అది కూడా రణ్‌బీర్ ను చూసి నేను పూర్తిగా స్టార్ స్ట్రక్ అయ్యాను. నేను అతనితో నటించేటప్పుడు నా డైలాగులను కూడా మరచిపోయేదాన్ని. దాంతో నేను అతనికి క్షమాపణలు చెప్పేదాని. రణ్‌బీర్ నా క్షమాపణలతో విసుగు చెంది...అతనికి ఇంకోసారి క్షమాపణ చెప్పోద్దని కోరాడు, ”అని పూజ అన్నారు. ఇకపోతే టాలీవుడ్ లో బడా హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. తాజాగా అల్లు అర్జున్ తో నటించిన 'అల...వైకుంఠపురములో' సినిమా హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.