
ఉత్తరాది నుంచి దక్షిణాదిలో ఆదరణ బాగుంటుందని, అవకాశాలు మెరుగ్గా ఉంటాయని వచ్చిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వారు ఉన్నారు. కానీ ఎంతైనా కొంతమందికి దక్షిణాది ప్రేక్షకులంటే చులకన, చిన్నచూపు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి చేరిపోయింది పూజా హెగ్డే. ఆమెకు పేరు, పలుకుబడి, సంపాదన, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని వచ్చింది ఇక్కడే అలాంటి సౌత్ ఇండస్ట్రీ మీద ఆమె చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు నిప్పు రాజేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..." సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ నడుము చూపిస్తేనే ఇష్టపడుతారు. మేము నడుము చూయించాలని భావిస్తారు" అని కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నీకు ఎంతో గుర్తింపు ఇచ్చిన ఈ ఇండస్ట్రీ గురించి అలా ఎలా మాట్లాడ్తావ్ అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
Tags: #Cinecolorz #PoojaHegde #Tollywood