
గ్లామర్ ఇండస్ట్రీ అంటేనే రోజుకో మొహం తెరపైకి వస్తుంటుంది. ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొంతమందికి అందం లేకపోయినా నటన, లక్ కలిసొస్తే ఓవర్ నైట్ స్టార్ అవుతారు. కొంతమంది ఎంత అందం, అభినయం ఉన్నా సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సమయం పడుతుంది. అయితే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు మాత్రం అందం, అభినయంతో పాటు లక్ కూడా ఉందనే చెప్పాలి. అందుకనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తుంది. తాజాగా సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. అయితే సీనియర్ హీరోతో ఎందుకు పూజ నటిస్తుందన్న ప్రశ్నకు ఆమె చక్కని సమాధానం ఇచ్చింది....అలాంటి స్టార్స్ తో ఫోటో దొరికితే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది అలాంటిది నాకు సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశమే వస్తే ఎలా ఒప్పుకోకుండా ఉంటానని జవాబు ఇచ్చింది. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దివాలి సినిమాలో పూజ నటించబోతుంది.