
సిజ్లింగ్ బ్యూటీ నటి పూజా హెగ్డే తన ఇటీవలి చిత్రం ‘అల...వైకుంఠపురంలో’తో క్రేజ్ విషయంలో మరో మెట్టెక్కింది. సినిమాలో బుట్టబొమ్మ పాటకు తగ్గట్టుగానే పూజా హెగ్డే నిజంగానే అందరిని బుట్టలో వేసింది. అదే కాకుండా మీ కెరియర్ లొనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. హీరోయిన్లలో కోట్లు కొల్లగొట్టగల సామర్ధ్యం పూజా హెగ్డేకు ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోయే 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్ గా పూజాకు అవకాశం దక్కింది. ఇప్పుడు అలాంటి మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సరసన. అది మరెవరో కాదు రణ్వీర్ సింగ్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో రణ్వీర్ డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా పూజా హెగ్డే హీరోయిన్గా కనిపిస్తుందని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.