
"ఒక లైలా కోసం" సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆమె మొదట అంగీకరించినది 'ముకుంద' అయినప్పటికీ, ఆ చిత్ర నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. అందువల్ల దాని కన్నా ముందే ఒక లైలా కోసం విడుదల అయింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఆమె జత కట్టింది. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా అడకపోయినప్పటికి, పూజా హెగ్డే అందం మరియు నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్యతో మళ్ళీ రొమాన్స్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. తన ప్రస్తుత ప్రాజెక్ట్ 'లవ్ స్టోరీ' పూర్తయిన తర్వాత అక్కినేని నాగ చైతన్య పరాశురం దర్శకత్వంలో 'నాగేశ్వరరావు' అనే సినిమా లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ వేసవి చివర్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం రష్మిక పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆమె ఇంతకు ముందు పరశురాంతో కలిసి గీతా గోవిందంలో వర్క్ చేసింది. కాబట్టి ఆమె తన దర్శకుడి కోసం తేదీలను సర్దుబాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అయితే పరశురాం ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.