
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు మంచి ఉపు మీదుంది. ప్రస్తుతం, ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'రాధే శ్యామ్'లో నటిస్తోంది. దీనిని జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో అక్కినేని అఖిల్‌తో స్క్రీన్ స్పెన్ ను పంచుకుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీలో కూడా పూజా హెగ్డే కనిపించవచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రం కోసం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. హరీష్ శంకర్ ఈ సినిమా కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డేను ఖరారు చేశారని సమాచారం. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుంది.