
బిగ్ బాస్ సీజన్ -4కు సంబంధించి మొన్నటివరకు చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటిలో చాలామంది తప్పుకున్నారు. సీజన్-4లో తాము పాల్గొనడం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పూనమ్ కౌర్ కూడా చేరిపోయింది. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ చాలా యాక్టివ్. అంతేకాదు, గతంలో జరిగిన కొన్ని వివాదాలు, మరికొన్ని సంచలనాల కారణంగా ఆమె తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికీ ఆమె ట్విట్టర్ లో అప్పుడప్పుడు (ఓ వ్యక్తి పేరు పైకి చెప్పకుండా) వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అందుకే ఈమెను హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు బిగ్ బాస్ నిర్వహకులు. దాదాపు వారం రోజుల పాటు బిగ్ బాస్ టీమ్ పూనమ్ కౌర్ కోసం ప్రయత్నించింది. మంచి ప్యాకేజీ కూడా ఆఫర్ చేసింది. కానీ ఆ ఆఫర్ ను పూనమ్ కౌర్ తిరస్కరించింది. ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందో కారణాలు బయటకు రానప్పటికీ.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, బిగ్ బాస్ షో పై పూనమ్ కు వ్యక్తిగతంగా విముఖత ఉన్నట్టు తెలుస్తోంది.