
దిశ అత్యాచార కేసులో నిందితులను కేస్ రికన్స్ట్రాక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ చేసిన కొద్ది సేపటికి దేశం మొత్తం సంబరాలు జరుపుకున్నారు. సినీ ప్రముఖులందరూ జరిగిన ఎన్ కౌంటర్ పై ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా నటి పూనమ్ కౌర్ సైతం ఈ ఘటనపై స్పందించింది. "తెల్లవారుజామున మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం జరిగింది. హైదరాబాద్ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వంకు అభినందనలు. అలానే నా లాంటి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షించాలని కోరుకుంటున్న. రెండు బెత్తం దెబ్బలు" అని ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉదేశించి చేసిందని అర్ధం అవుతుంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే డిలీట్ చేసింది. మరి పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్వీట్ ను పూనమ్ ఎందుకు డిలీట్ చేసిందో.