పవన్ అభిమానులకు ఈరోజు నిజంగా పండగే… మరోసారి పోలీస్ గా పవర్ స్టార్!
3 years ago 1 min read

దసరా నాడు టాలీవుడ్ ప్రేక్షకులను సినిమా హీరోలందరూ తమ సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తూ పండగను మరింత ప్రత్యేకంగా మార్చారు. కానీ ఎవరూ ఉహించని ప్రకటన ఒకటి అందరిని ఆనందంలో ముచ్చెతోంది. అదే.....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫెమ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇంకా అదిరిపోయే న్యూస్ ఏమిటంటే అందులో పవన్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. పోలీస్ గా కనిపించిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంటే ఆ తరువాత వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయిన పవన్ ను మరోసారి మంచి పవర్ఫుల్ పోలీస్ అవతారంలో చూడాలనే అభిమానుల కోరిక ఈ సినిమాతో నెరవేరబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.