
నిన్న వైజయంతి మూవీస్ ఎప్పుడైతే ప్రభాస్ #21 కు సంబంధించిన అప్డేట్ ఇస్తామని చెప్పిందో అప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ నిమిషం రానే వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె హీరోయిన్ అని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఇది విడుదలైన మరుక్షణం నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అలియా, కియారా వంటి పేర్లు వినిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా దీపికా అనేసరికి అందరికి నిజంగానే బ్రేకింగ్ న్యూస్ అయింది. ఏదేమైనా ఈ ప్రకటనతో అంచనాలు మరింత పెరిగాయి.