
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ గురించి ఇప్పుడు ఎంత చెప్పిన తక్కువే. బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ తో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ప్రభాస్ సినిమాల అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే డార్లింగ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీనితో పాటు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 'ఆదిపురుష్' లో రాముడిగా కనిపించబోతున్నాడు. ఇది ప్రభాస్ కారియర్ లో బిగ్ బడ్జెట్ ఫిలిం అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభించినట్లు 'ఆదిపురుష్' టీం ప్రకటించి అభిమానులకు తీపి కబురు అందించింది. ఇక ఈ సినిమా కాకుండా కెజిఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ తో 'సలార్' చేస్తున్న విషయం తెలిసిందే.