
ఈ ఏడాది జూన్ నెలలో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన పెద్దనాన్న ప్రముఖ నటుడు కృష్ణరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి పార్లమెంటు సభ్యుడు జె సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ మెరుగైన పని యొక్క మూడవ దశను MP సమక్షంలో అతని నివాసంలో మూడు మొక్కలను నాటి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో 1000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేస్తానని మాట ఇచ్చారు. అన్నట్టుగానే నేడు ఎంపీ జె సంతోష్ సమక్షంలో 1650 ఎకరాలను డెవలప్ చేసేందుకు దత్తత తీసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ కార్యంతో ప్రభాస్ మరో మెట్టు పైకెక్కారు.