
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలికి ముందు వరకు కేవలం సౌత్ కు పరిచయం ఉన్న ప్రభాస్ బాహుబలి తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్, హాలీవుడ్ ఇలా తేడా లేకుండా ప్రభాస్ కు భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారంటే క్రేజ్ ఏ రేంజ్ లో అర్ధం చేసుకోవచ్చు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసి మన దర్శనిర్మాతలు విఫలం అవుతున్నారని టాక్. భారీ బడ్జెట్ సినిమాలు కొత్త దర్శకుడి చేతిలో పెడితే ఒక్క చిన్న తప్పు జరిగిన నిర్మాతలు మునిగిపోతారు. అందుకు సాక్ష్యం "సాహో" నే. భారీ నిర్మాణవిలువలతో వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయ్యింది. దీంతో ఈసారి ఏకంగా అంతర్జాతీయ నిర్మాణ సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్ భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో రాజమౌళి తర్వాత స్పెషలిస్ట్ అయిన శంకర్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారట. రూ.1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇంటర్నేషనల్గా హెవీ మార్కెట్ ఉన్న ప్రభాస్తో శంకర్ సినిమా టాక్ రావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.