
ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యొక్క పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మిర్చి స్టార్ క్లీన్ షేవె తో ఉన్న లుక్లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోషూట్లో ప్రభాస్ చేతిలో తుపాకీ పట్టుకొని యంగ్ అండ్ రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. బాహుబలిలో బాడీ పెంచి బల్క్ గా కనిపించిన ప్రభాస్ ను త్రో బ్యాక్ ఫోటోలో ఇలా క్లిన్ షేవ్ తో చూసిన ఫ్యాన్స్ అబ్బా.! అందగాడు అంటూ మురిసిపోతున్నారు. ఈశ్వర్ అనే యాక్షన్ డ్రామాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ కు అది హిట్ గా మిగిలకపోయినా నటనకు మంచి మర్ఖులే పడ్డాయి. కానీ 2015 లో బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. నటుడిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించినున్న రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం మరియు తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించే ఆదిపురుష్ వంటి పలు చిత్రాలలో ప్రభాస్ నటించనున్నారు.