
రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన "మత్తు వదలరా" సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు శ్రీ సింహ హీరోగా పరిచయమయ్యాడు. అంతేకాదు మరో కొడుకు కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సినిమా చూసిన వారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేవలం సినీ విమర్శకులే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి కూడా సినిమాను కొనియాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది. ఫేస్బుక్ వేదికగా శ్రీ సింహ, కాళ భైరవపై ప్రశంసలు కురిపించాడు. "మత్తు వదలరాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది. మొదటి సినిమాలోనే శ్రీ సింహ ఈ విధంగా చేయటం సంతోషంగా ఉంది. కాళ భైరవాకు నా అభినందనలు" అని పోస్ట్ చేసాడు.